Arvind Kejriwal: అప్పుడే కేంద్రం తప్పుడు కేసులు బనాయిస్తుంది: కేజ్రీవాల్
Arvind Kejriwal Criticises Centre Over False Cases| కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తనను విమర్శించిన వారిపై అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు పెడుతుందన్నారు. ఇందుకోసం భారత్‌లో ఇప్పుడు సరికొత్త సిస్టం ఉందని
దిశ, వెబ్‌డెస్క్: Arvind Kejriwal Criticises Centre Over False Cases| కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తనను విమర్శించిన వారిపై అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు పెడుతుందన్నారు. ఇందుకోసం భారత్‌లో ఇప్పుడు సరికొత్త సిస్టం ఉందని, అందులో ముందుగా కేంద్రం ఎవరిని అరెస్ట్ చేయాలో నిర్ణయించుకుంటుందని, ఆ తర్వాత వారిపై తప్పుడు కేసులను తయారు చేస్తుందని అన్నారు. 'కేంద్రం ఎవరిని అరెస్ట్ చేయాలో ఆ టార్గెట్ ముందుగా ఎంచుకుంటుంది. ఆ తర్వాత వారిపై తప్పుడు కేసులు చిత్రీకరిస్తుంది. త్వరలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ శిశోడియా అరెస్ట్ అవుతారు. మూడు నాలుగు రోజుల్లోనే ఇది జరుగుతుంది' అని కేజ్రీవాల్ అన్నారు. అయితే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలోని అవకతవకలపై సీబీఐ విచారణకు లెఫ్టనెంట్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అన్నారు.
ఇది కూడా చదవండి: భూమి అంతానికి మనమే కారణమా? ఈ మార్గాల్లోనే ఆ ముగింపు రానుంది!