శివసేన కార్యాలయం బయట హనుమాన్ చాలీసా : ఆ నలుగురు అరెస్ట్
ముంబై: శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం ముందు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో వి
ముంబై: శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం ముందు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో వినిపించినందుకు నలుగురు మహరాష్ట్ర నవనిర్మాణ్ సేవ(ఎంఎన్ఎస్) కార్యకర్తలను అరెస్ట్ చేశారు. క్యాబ్ పైన లౌడ్ స్పీకర్‌ను అమర్చి శ్రీరాముడు, ఎంఎన్ఎస్ పార్టీ చీఫ్ రాజ్ థాక్రే ఫోటోలు ఉంచారని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వాహనంతో పాటు లౌడ్ స్పీకర్‌ను సీజ్ చేశారు. దీనికి కారణమైన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే స్పందిస్తూ, రెచ్చగొట్టే పనులతో పార్టీ వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మా హిందుత్వం ఏంటో ప్రజలకు తెలుసని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను తాము నేరవేరుస్తామని చెప్పారు. మరోవైపు పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ఆలయంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు కొందరు హనుమాన్ చాలీసాతో పాటు మతపరమైన పాటలు పాడారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు నిషేధించాలని డిమాండ్ చేశారు. లేనిచో మసీదు బయట హనుమాన్ చాలీసా పెద్ద సౌండ్‌తో స్పీకర్లు పెట్టి వినిపిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.