పాకిస్థానీ మ‌హిళా మ్యుజీషియ‌న్‌కు మొద‌టిసారి ఈ గుర్తింపు ద‌క్కింది!

గ్రామీ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో ఆమెకు ఈ గౌర‌వం ద‌క్కింది. First Pakistani Female Musician got Grammy Award

Update: 2022-04-04 07:36 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః విజయానికి షార్ట్‌క‌ట్‌లు ఉండ‌వన్న‌ది వాస్త‌వం. అనాది నుండి మ‌నిషి జీవితంలో భాగ‌మైన సంగీతంలోనూ అంతే, ఎంతో కృషి, ప‌ట్టుద‌ల ఉంటే త‌ప్ప గుర్తింపు సాధ్యంకాదు. మ‌న‌సుకి ఊర‌ట‌నిచ్చి, మ‌నిషిని ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన గొప్ప క‌ళ‌ల్లో ఒక‌టైన‌ సంగీతంలో ఉత్త‌మ సంగీత‌కారులుగా నిల‌బ‌డటం, అందులోనూ ప్ర‌పంచవ్యాప్తంగా అత్యుత్త‌మ గుర్తింపు పొంద‌డం మ‌రింత గొప్ప‌ విష‌యం. అదీ, ఒక దేశానికి చెందిన మ‌హిళ‌లంద‌రి త‌ర‌ఫున‌ ఇలాంటి గుర్తింపును మొద‌టిసారి సాధించడం ఇంకెంత ఘ‌న‌తో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రంలేదు. స‌రిగ్గా అలాంటి ఘ‌న‌తే బ్రూక్లిన్‌కు చెందిన పాకిస్థానీ గాయని ఆరూజ్ అఫ్తాబ్‌కు ద‌క్కింది. ఈ ఏడాది గ్రామీ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో ఆమెకు ఈ గౌర‌వం ద‌క్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని అందుకున్న తొలి పాకిస్థానీ మహిళగా ఆరూజ్ నిలిచింది. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో ఆమె పాడిన‌ 'మొహబ్బత్' పాటకు ఆరూజ్ ఈ అవార్డు గెలుచుకుంది. అలాగే, ఆమె 'బెస్ట్ న్యూ ఆర్టిస్ట్‌'గా కూడా నామినేట్ అయ్యింది.

.@Arooj_Aftab's "Mohabbat" wins Best Global Music Performance at the 2022 #GRAMMYs.

ఆరూజ్ 2005లో బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో సంగీతం అభ్యసించింది. ఆమె తన మొదటి ఆల్బమ్ 'బర్డ్ అండర్ వాటర్'ను 2014లో విడుదల చేసింది. ఆరోజ్ 2015లో హిందీ చిత్ర పరిశ్రమలో పాడటం ప్రారంభించింది. మేఘనా గుల్జార్ చిత్రం 'తల్వార్'లో ఆమె 'ఇన్సాఫ్' టైటిల్ సాంగ్ పాడింది. 2008 నోయిడా జంట హత్య కేసు ఆధారంగా ఈ ట్రాక్‌ని విశాల్ భరద్వాజ్ కంపోజ్ చేశాడు. ఈ చిత్రంలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్, నీరజ్ కబీ, కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. 

Tags:    

Similar News