chicken bones: చికెన్ బోన్స్ తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

చికెన్(chicken) ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-12-31 11:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: చికెన్(chicken) ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. చికెన్ అని పేరు వినిపించగానే చికెన్ లవర్స్‌కు నోట్లో నీళ్లూరుతాయి. ఆదివారం వస్తే చాలు అందరి ఇళ్లలో చికెన్ ఉండాల్సిందే. అయితే చికెన్‌లో ఒక్కో పార్ట్ ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది. లివర్(Lever), పీసెస్(pieces), బోన్స్(Bones) ఇలా ఇష్టంగా తింటుంటారు. మరీ చికెన్ బొక్క ఇష్టంగా లాగించేవారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. కొంతమంది చికెన్ బోన్స్ తింటే మంచిది కాదని, పలువురు ఆరోగ్యానికి మేలని భావిస్తారు.

దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా నిపుణులు వెల్లడించారు. నాటు కోడి బోన్స్ తింటే హెల్త్‌కు ఎందో మంచిదని సూచిస్తున్నారు. దీని బోన్‌లో మజ్జలో కొల్లాజన్(Collagen), కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్(Conjugated Linoleic Acid), గ్లూకోసమైన్(Glycine), గ్లైసిన్(Glucosamine) వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని పెయిన్స్‌(Pains)ను, వాపుల్ని(swelling) తగ్గించడంలో సహాయపడతాయి.

అంతేకాకుండా కీళ్ల ఆరోగ్యాన్ని(Joint health) మెరుగుపరుస్తాయి. చర్మ ఆరోగ్యానికి(skin health) దోహదం చేస్తాయి. అంతేకాకుండా చికెన్ బోన్స్ మూలగ లో జింక్(Zinc), కాల్షియం(Calcium), ఖనిజాలు(Minerals), సెలీనియం(Selenium) పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నార. ఇవి బాడీకి కావాల్సినన్నీ పోషకాలు(Nutrients) అందించడమే కాకుండా.. రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచడంలో తోడ్పడతాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News