ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? శరీరంలో వాటర్ శాతం తక్కువున్నట్లే..?

బాడీ డీహైడ్రేషన్ (Body dehydration)బారిన పడకుండా ఉండేందుకు రోజులో శరీరానికి సరిపడ వాటర్(water) తీసుకోవాలని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.

Update: 2025-01-07 12:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాడీ డీహైడ్రేషన్ (Body dehydration)బారిన పడకుండా ఉండేందుకు రోజులో శరీరానికి సరిపడ వాటర్(water) తీసుకోవాలని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ శరీరంగా సక్రమంగా పనిచేయాలంటే వాటర్ తప్పక తాగాల్సిందే. నీరు తాగకపోతే డీహైడ్రేషన్ లక్షణాలు బాడీలో ఈ విధంగా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. డీహైడ్రేషన్ సమస్యలేంటో సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..

రోజులో శరీరానికి సరిపడ వాటర్ తాగకపోతే చర్మంపై ముడతలే ఏర్పడుతాయి. చర్మం డ్యామేజ్ (Skin damage)అవుతుంది. అంతేకాకుండా స్కిన్ పై దురద ఏర్పడుతుంది. అలాగే తీవ్రమైన అలసట(Severe fatigue) వస్తుంది. జీర్ణక్రియ(digestion), కండరాల పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తుంది. డీహైడ్రేషన్ కారణంగా బాడీలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత(Electrolyte balance)ను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రైన్(Migraine), తలనొప్పి వంటి లక్షణాలు కనిపి్తాయి.

వాంతులు, వికారం, తలనొప్పి(headache), మూత్రం రంగులో మార్పు, నోటి దుర్వాసన(Bad breath), మలబద్ధకం(Constipation) సమస్యమైకం, మూర్ఛ(Fainting) వంట లక్షణాలు కనిపిస్తాయి. కాగా మనిషి ఆరోగ్యం కోసం రోజుకు 8 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ వాటర్ తాగాలి. 

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News