ప్ర‌పంచ‌మంతా ఇష్టపడే వాసన ఇదేనంట‌..?! న్యూ స్ట‌డీ నివేదిక‌

అంద‌రికీ న‌చ్చే వాస‌న అరుదుగానే ఉంటుంది. There's one smell that most people around the world like.

Update: 2022-04-06 08:05 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఒకొక్క‌రికీ ఒక్కో వాస‌నంటే ఇష్టం ఉండ‌దు. కొంద‌రికి కొన్ని వాస‌న‌లు చాలా ఇష్టం. అయితే, అంద‌రికీ న‌చ్చే వాస‌న అరుదుగానే ఉంటుంది. కానీ, శాస్త్ర‌వేత్త‌లు దానికి మించి, విశ్వ‌వ్యాప్తంగా దాదాపుగా అంద‌రూ ఇష్ట‌ప‌డే వాస‌న‌ను క‌నిపెట్టారు. లింగం, సంస్కృతి, జాతీయత, జాతితో సంబంధం లేకుండా అత్యధిక సంఖ్యలో వ్యక్తులకు అత్యంత ఆహ్లాదకరమైన వాసన ఏదో కనుక్కున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, వాస‌న అనేది ర‌సాయన‌ శాస్త్రానికి సంబంధించింది. ఒకే వాసనకు సంబంధించిన‌ అణువుల‌ నిర్మాణం, దానిని మానవులు ఎలా స్వీకరిస్తారు, ఆశ్వాదిస్తారు అనే విష‌యాన్ని ఇక్క‌డ తెలుసుకోవ‌చ్చు. ఇక‌, వ్య‌క్తి సాంస్కృతిక నేపథ్యం ఏమైనప్పటికీ, శాస్త్రీయంగా మ‌నిషి చుట్టూ ఉన్న‌ మంచి, చెడు వాసనలపై ఏకాభిప్రాయం ఏర్పడుతుందని పరిశోధకులు అంటున్నారు. దీనిని బ‌ట్టి అత్య‌ధికంగా ఇష్ట‌ప‌డే వాస‌న‌ను ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

'కరెంట్ బయాలజీ జర్నల్‌'లో ప్రచురించిన‌ ఈ అధ్యయనం కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న 235 మంది విభిన్న‌ వ్య‌క్తుల‌ను ఎంచుకున్నారు. ఏ వాసన అత్యంత ఆహ్లాదకరమైనదో తెలుసుకోవడానికి వీళ్లంద‌రికీ వివిధ వాస‌న‌లు చూపించి, వాటికి ర్యాంక్‌లు ఇవ్వ‌మ‌ని అడిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఒకే రకమైన వాసనను ఇష్టపడుతున్నారా, లేదా.. ఒక‌వేళ‌, వాస‌న‌పై ఇష్టం అనేది సాంస్కృతికంగా నేర్చుకున్నదేనా అని శాస్త్ర‌వేత్త‌లు పరిశీలించారు. అయితే, ఈ స్ట‌డీలో వాస‌న‌కు, సంస్కృతికి చాలా తక్కువ సంబంధం ఉందని గ్ర‌హించారు. మొత్తంగా, అధ్యయనంలో ఆల్ రౌండ్ విజేతగా వెనీలా వాసన అంద‌రికీ నచ్చిన‌ట్లు తెలిసింది. అయితే, ఇది ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రతి వ్యక్తికి క‌చ్చితంగా ఇష్టమైన వాసన కానప్పటికీ, దాదాపుగా చాలా మంది వ్యక్తులు ఇష్ట‌ప‌డుతున్న వాస‌న‌గా ర్యాంక్ చేయబడింది.ఇక‌, 'మనం ఒక నిర్దిష్ట వాసనను పసిగట్టినప్పుడు మెదడులో ఏం జరుగుతుందో చూసి, దానితో ఈ జ్ఞానాన్ని అనుసంధానించడం ద్వారా ఇది ఎందుకు జరుగుతుందో అధ్యయనం చేయడం తదుపరి దశ' అని ప‌రిశోధ‌కులు అన్నారు. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని క్లినికల్ న్యూరోసైన్స్ విభాగంలో పరిశోధకుడిగా ఉన్న ఆర్టిన్ అర్షమియన్ ఈ అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించాడు.

Tags:    

Similar News