రిక్షాతొక్కిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రిక్షాకార్మికుడి అవతారం ఎత్తారు.

Update: 2022-08-02 13:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రిక్షాకార్మికుడి అవతారం ఎత్తారు. చెత్త రిక్షా తొక్కారు. వివరాల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరం గ్రామంలో మంగళవారం జగనన్న స్వచ్ఛ సంకల్ప రిక్షా పంపిణీ కార్యక్రమానికి మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 41 చెత్త రిక్షాలు, తడి చెత్త పొడి చెత్త డస్ట్‌బిన్‌లను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో పాటు చెత్తరిక్షాలను తొక్కి సందడి చేశారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదాన్ని అనుసరిస్తూ గ్రామంలోని పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పిలుపునిచ్చారు.





Similar News