కామన్ సైడ్ ఎఫెక్ట్స్: ఇన్‌కరెక్ట్ ట్రీట్మెంట్‌తో సివియర్ హెల్త్ ఇష్యూస్
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో యాంటిబయాటిక్స్ వాడటం నార్మల్ అయిపోయింది. జలుబు, దగ్గు, చిన్న వైరల్ ఫీవర్.. ఇలా సమస్య ఏదైనా యాంటిబయాటిక్ వేసుకోవడం అలవాటైపోయింది..Latest Telugu News
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో యాంటిబయాటిక్స్ వాడటం నార్మల్ అయిపోయింది. జలుబు, దగ్గు, చిన్న వైరల్ ఫీవర్.. ఇలా సమస్య ఏదైనా యాంటిబయాటిక్ వేసుకోవడం అలవాటైపోయింది. కానీ డాక్టర్స్ మాత్రం 'మెనింజైటిస్, న్యుమోనియా' లాంటి సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఎటాక్ అయినప్పుడు మాత్రమే వీటిని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే సొంత వైద్యంతో హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు.. యాంటిబయాటిక్స్‌ను కరెక్ట్‌గా వాడితే ఎన్ని లాభాలు ఉంటాయో, అనవసరంగా వినియోగిస్తే అన్ని సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని చెబుతున్నారు.
ఉపయోగించేందుకు సరైన మార్గం ఏమిటి?
యాంటీబయాటిక్స్‌ను తగిన విధంగా తీసుకోవడం అత్యవసరం. నిజానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన పేషెంట్ బాగున్నప్పటికీ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తి చేయాలి. మధ్యలో ఆపేస్తే.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మళ్లీ సంక్రమించే అవకాశాలు ఉంటాయి లేదా బ్యాక్టీరియా ఆ యాంటీబయాటిక్‌కు నిరోధకతను కలిగి ఉంటుంది.
కామన్ సైడ్ ఎఫెక్ట్స్ :
* యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విరేచనాలు, వికారం, ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలను అనుభవించే అవకాశాలు ఉన్నాయి. నిరంతరం కడుపు నొప్పి, ఆకలి లేకపోవడంతో నీరసంగా మారిపోతారు. అటువంటి సందర్భాల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్‌తో తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. దీనివల్ల రికవరీకి ఎక్కువ సమయం తీసుకుంటూ.. హాస్పిటల్‌లోనే గడిపే అవకాశం ఉంటుంది. ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్స్ అవసరమయ్యే పరిస్థితులకు దారితీస్తుంది.
యాంటిబయాటిక్స్‌తో జాగ్రత్త :
* సాధారణ జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను యాంటీబయాటిక్స్ పరిష్కరించలేవు. ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లైంగికంగా సంక్రమించే వ్యాధులు(STD), బ్యాక్టీరియల్ న్యుమోనియాకు కరెక్ట్‌గా పనిచేస్తాయి. కాబట్టి సరైన ఇన్ఫెక్షన్ కోసం మాత్రమే వాటిని ఉపయోగించాలి.
* జలుబు, వైరల్ ఫీవర్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కోసం యాంటీబయాటిక్ తీసుకుంటే.. గట్ ఫ్లోరాకు అంతరాయం కలిగిస్తుంది. బరువు పెరగడం, ఊబకాయంతో పాటు మరిన్ని శారీరక, మానసిక వ్యాధులకు కారణమవుతుంది.
* యాంటీబయాటిక్స్ తీసుకునే ముందు 'బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ లేదా వైరల్'.. మీ సమస్య ఏదో ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి.
* తేలికపాటి అనారోగ్యం కలిగినప్పుడు ర్యాండమ్‌గా మెడికల్ హెల్ప్ తీసుకోవడం అనవసరమైన యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ల అవకాశాలను పెంచుతుంది. సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనేందుకు పోరాడుతుంది. కానీ సరైన వైద్య సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటే.. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి తేలికపాటి ఇన్ఫెక్షన్ విషయంలో మందులు తీసుకునేందుకు తొందరపడకుండా.. లక్షణాలు మెరుగుపడతాయో లేదో చూసేందుకు కొన్ని రోజులు వెయిట్ చేయాలి.
* యాంటీబయాటిక్స్‌తో సొంత వైద్యం చేసుకుంటే తెలియకుండానే యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్(AMR) భారాన్ని పెంచినవారు అవుతారు. అలాంటప్పుడు బ్యాక్టీరియా ఔషధాలకు నిరోధకతను కలిగి ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం ఆరోగ్య పరిశ్రమకు కూడా సవాలుగా మారుతుంది. అంటే యాంటీబయాటిక్స్ వినియోగం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా సొసైటల్ లెవల్‌లో కీలకపాత్ర పోషించగలదు. కాబట్టి ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
* కొన్ని బ్యాక్టీరియాలు తమ ఔషధ నిరోధక లక్షణాలను ఇతర బ్యాక్టీరియాకు పంపిస్తుంటాయి. ఇది ఒకరికొకరు జీవించడంలో సాయపడేందుకు కొన్ని చిట్కాలతో సాగుతున్నట్లుగా ఉంటుంది.
* వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు యాంటీబయాటిక్స్ తీసుకోవడం ద్వారా.. యాంటీబయాటిక్ అనేది శరీరంలో బ్యాక్టీరియాపై దాడి చేస్తుంది. కానీ ఇది ఆరోగ్యానికి సాయపడే లేదా వ్యాధికి కారణం కానటువంటి మంచి బ్యాక్టీరియా కావచ్చు. ఇలాంటి ఇన్‌కరెక్ట్ ట్రీట్మెంట్ హార్మ్‌లెస్ బ్యాక్టీరియాలో యాంటీబయాటిక్ నిరోధక లక్షణాలు ప్రోత్సహించి, ఇతర బ్యాక్టీరియాతో షేర్ చేసుకునేలా చేస్తుంది లేదా హార్మ్‌లెస్ బ్యాక్టీరియాను రీప్లేస్ చేసేందుకు హానికరమైన బ్యాక్టీరియాకు అవకాశం కల్పించవచ్చు.
*మళ్లీ అనారోగ్యానికి గురైతే మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను ఎప్పుడూ తీసుకోవద్దు. ఎందుకంటే అవి ప్రస్తుత స్థితికి సరైన చికిత్సగా ఉండకపోవచ్చు.
* మరొక వ్యక్తికి సూచించిన యాంటీబయాటిక్స్‌ను కూడా ఎప్పుడూ తీసుకోకూడదు.