ఫ్యామిలీ పరువు తీశానంటూ దుమ్మెత్తిపోశారు.. ఇప్పుడు సెల్ఫీ అడుగుతున్నరు
దిశ, సినిమా: ప్రముఖ హిందీ నటి, సోషల్ మీడియా సెన్సేషన్ అంజలీ అరోరా బంధువులు తనను ఎగతాళి చేయడంపై రియాక్ట్ అయింది..Latest Telugu News
దిశ, సినిమా: ప్రముఖ హిందీ నటి, సోషల్ మీడియా సెన్సేషన్ అంజలీ అరోరా బంధువులు తనను ఎగతాళి చేయడంపై రియాక్ట్ అయింది. టిక్ టాక్ వీడియోలతో ఒక్కసారిగా పాపులారిటీ పెంచుకున్న నటి.. ఇటీవల 'లాక్ అప్' కంటెస్టెంట్గా అలరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రియాలిటీ షోకు రాకముందు తన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తట్టుకోలేని కొంతమంది బంధువులు.. తమను కించపరుస్తుందంటూ తన తల్లిదండ్రులను తిట్టేవారని చెప్పింది.
అంతేకాదు డ్యాన్స్ వీడియోలను చూసి కుటుంబ ప్రతిష్టను దిగజార్చిందని రకరకాలుగా విమర్శించారన్న ఆమె.. తన పేరెంట్స్ మాత్రం వాటన్నింటినీ పట్టించుకోకుండా మద్దతుగా నిలబడ్డారని తెలిపింది. ఇక అప్పుడు తిట్టిన వాళ్లే ఇప్పుడు తనతో సెల్ఫీలు దిగుతుంటే చాలా గర్వంగా ఉందన్న అంజలి.. రియాల్టీ షోలో పాల్గొనాలనే కల నిజమైందని, 'లాక్ అప్'తో ఇంత పాపులారిటీ పెరుగుతుందని ఊహించలేదని చెప్పింది.