చిన్న అమ్మాయిని భార్యగా నటించమన్నాడు.. అంజలి షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: కంగనా రనౌత్ షో ‘లాక్ అప్’ మెల్లగా వేగం పుంజుకుని ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది..latest telugu news

Update: 2022-03-11 09:08 GMT

దిశ, సినిమా: కంగనా రనౌత్ షో 'లాక్ అప్' మెల్లగా వేగం పుంజుకుని ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇందులో నడిచే డ్రామాతోపాటు కంగనా రనౌత్ అవతారం కూడా నెటిజన్లను కట్టిపడేస్తుంది. అయితే ఈ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన నటులు తమ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలను బయటపెడుతూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుండగా.. ప్రస్తుతం జైలర్‌గా ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంజలి అరోరా నటుడు కరణ్‌వీర్ బోహ్రా తనను లైగికంగా వేధించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ మేరకు కరణ్ తనతో ఫ్రెండ్‌గా వ్యవహరిస్తూనే ఓ దశలో ప్రేయసిగా ఉండాలని కోరినట్లు చెప్పిన అంజలి.. ఎన్నోసార్లు తనతో క్లోజ్‌గా ఉండాలంటూ పిచ్చిగా బిహేవ్ చేశాడని వెల్లడించింది. అలాగే మరోసారి ఓ గేమ్‌ ఆడుదామంటూ తనకు భార్యగా నటించాలన్న ఆయన..'నా యుక్త వయసు అయిపోయింది. కాబట్టి నీలాంటి చిన్న అమ్మాయి నాతో సన్నిహితంగా ఉంటే.. మరింతమంది నన్ను ఇష్టపడతారు. ప్రజల్లో పాపులారిటీ కూడా పెరుగుతుంది' అంటూ విసిగించాడని తెలిపింది. ఇక ఈ విషయం ఇతరులకు తెలియడంతో ఆటపట్టిస్తున్నానంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడంటోంది అంజలి అరోరా.

Tags:    

Similar News