కరిచిందన్న కోపంతో.. పామునే చంపి తినేశాడు

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పాములను చూస్తేనే ఒణికిపోతుంటారు జనాలు. పాముల వీడియోలు చూసినా చాలా భయపడిపోతుంటారు..Latest Telugu News

Update: 2022-06-22 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పాములను చూస్తేనే ఒణికిపోతుంటారు జనాలు. పాముల వీడియోలు చూసినా చాలా భయపడిపోతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనను కరిచిందనే కోపంతో ఏకంగా పామునే తినేశాడు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తర ప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన మతాబాదల్ సింగ్ ను ఆదివారం సాయంత్రం పొలం నుండి తిరిగి ఇంటికి వస్తుండగా విషపూరిత పాము కాటు వేసింది. అయితే బాధితుడు వైద్య సహాయం కోసం ఆసుపత్రికి పరుగెత్తడానికి బదులు, దాని మీద కోపోద్రిక్తుడై, కరిచిన పామును చంపి కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి పరపర నమిలి తినేశాడు. ఒంటి మీద గాయాలు, రక్తపు మరకలు ఉన్న అతడిని కుటుంబ సభ్యులు చూసి కంగారుతో ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అతడిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉనట్టు వైద్యులు తెలిపారు.


Similar News