పదోన్నతులు కల్పించి.. పక్కన పెట్టేశారు..!?

అనస్థీషియా విభాగంలోని అసోసియేట్​ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించినా సర్కార్​, ఇప్పటి వరకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు.

Update: 2022-03-22 23:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అనస్థీషియా విభాగంలోని అసోసియేట్​ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించినా సర్కార్​, ఇప్పటి వరకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. డీపీసీ పూర్తయి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పోస్టింగ్‌ల ఫైల్​ ముందుకు సాగడం లేదు. కేవలం మంత్రి హరీష్​రావు సంతకం కాలేదని అధికారులు ఆపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సుమారు 30 మంది అనస్థీషియా డాక్టర్లు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని విభాగాల పదోన్నతులు, పోస్టింగ్స్‌‌ను క్లియర్​ చేసిన హరీష్​రావు దీన్ని మాత్రమే ఆపడంపై అనస్థీషియా డాక్టర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్‌లు వేగంగా ఇవ్వాలని కోరుతున్నారు.

డీపీసీ సమయంలోనూ అంతే...

30 మంది అసోసియేట్​ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించేందుకు పెట్టిన ఫైల్‌ను ఉన్నతాధికారులు చివరి నిమిషం వరకు క్లీయర్​చేయలేదు. నెలలుగా పెండింగ్​పెట్టి డీపీసీ చివరి తేది ఫిబ్రవరి నెలలలో మూవ్​చేశారు. ప్రమోషన్లు జరిగినా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం దారుణమని సదరు లిస్టులో ఉన్నే ప్రొఫెసర్లు వాపోతున్నారు.

మెడికల్​ కాలేజీలకు మేలు....

మెడికల్​ డిపార్ట్​మెంట్‌లో అనస్థీషియా విభాగం చాలా కీలకం. సర్జరీలు నిర్వహించడంలో ఈ విభాగపు డాక్టర్ల పాత్ర చాలా అవసరం ఉంటుంది. దీంతో ప్రస్తుతం ప్రమోషన్లు పొందిన డాక్టర్లను ప్రొఫెసర్లుగా కొత్త మెడికల్​ కాలేజీలకు పంపడం వలన మెడికల్ విద్యార్థులకు, పేషెంట్లకు ఎంతో లాభం చేరుతుందని మెడికల్​ ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. కానీ సర్కార్​ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో? అర్థం కావడం లేదని స్వయంగా ప్రభుత్వ డాక్టర్లు మండిపడుతున్నారు.

Tags:    

Similar News