నా మొదటి బెస్ట్ ఫ్రెండ్ అతనే.. పేరు చెప్పేసిన అనన్య
దిశ, సినిమా: యంగ్ సెన్సేషన్ అనన్యా పాండే తన మొదటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. అనతికాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే..Latest Telugu News
దిశ, సినిమా: యంగ్ సెన్సేషన్ అనన్యా పాండే తన మొదటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. అనతికాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. కాగా బాల్య దశలోనే మిత్రులతో కలిసి చాలా పొరపాట్లు చేశానని, స్టార్ కిడ్ అనే కారణంగా ఎవరూ మందలించేవారు కాదని వెల్లడించింది.
ఈ క్రమంలోనే తన కజిన్ 'అహాన్' చిన్ననప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన అనన్య.. ఎన్ని మనస్పర్థలు వచ్చినా సరే కూల్‌గా సాల్వ్ చేసుకుంటామని, జీవితాంతం ఇలాగే కలిసుంటామని చెప్పింది. ఇక తనతో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసిన నటి.. ఇద్దరిలో తానెవరో గుర్తించమంటూ నెటిజన్లకు సరదాగా పరీక్ష పెట్టడం విశేషం. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన నటించిన 'జన గణ మన' ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.