Tirumala: తుపాన్ ఎఫెక్ట్.. తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..

తిరుమల (Tirumala)లో నేడు (గురువారం) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.

Update: 2024-11-28 04:55 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో నేడు (గురువారం) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. నిన్న 67,626 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 22,231 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కుల్ని చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. కాగా.. ఓ వైపు తుపాను (Cyclone Fengal), మరోవైపు చలి కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ తగ్గిందంటున్నారు అధికారులు. తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో.. తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు భావిస్తున్నారు. 

కాగా.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నవితరణ కేంద్రం వద్ద ఫిర్యాదుల పుస్తకాలను తనిఖీ చేశారాయన. వాటిలో భక్తులు.. సౌకర్యాలు బాగున్నాయని రాసినట్లు చెప్పాలి. తిరుమలను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, సీఎం ఆకాంక్ష మేరకు మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

Tags:    

Similar News