రన్నింగ్ ట్రైన్‌లోనే యువతిపై లైంగిక దాడికి యత్నం.. చివరికి ఏం జరిగిందంటే..?

మద్యం మత్తులో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రన్నింగ్ ట్రైన్‌లోనే యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన విశాఖ ఎక్స్‌ప్రెస్

Update: 2024-07-09 16:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రన్నింగ్ ట్రైన్‌లోనే యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సికింద్రాబాద్-భువనేశ్వర్ రూట్‌లో ప్రయాణించే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ట్రైన్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లిన యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ కామాంధుడి చెర నుండి తప్పించుకునే క్రమంలో ఇద్దరు మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో యువతి, యువకుడు ఇద్దరు రన్నింగ్ ట్రైన్ నుండి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఇద్దరిని మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News