మూస పద్ధతులను బద్దలు కొట్టడమే లక్ష్యం.. బిగ్ బి మనవరాలు
దిశ, సినిమా : అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలి నందా ఫస్ట్ ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్‌లోనే మనిషి విలువ గురించి మాట్లాడింది.
దిశ, సినిమా : అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలి నందా ఫస్ట్ ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్‌లోనే మనిషి విలువ గురించి మాట్లాడింది. తాజాగా 'లోరియల్ పారిస్'కు సంబంధించిన ఓ ప్రకటనలో నటించిన బ్యూటీ.. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కార్పొరేట్ ప్రపంచంలో పూర్తి స్వేచ్ఛ కలిగివున్న అమ్మాయి సక్సెస్‌ను వివరించిన నవ్య.. మూస పద్ధతులను బద్దలు కొట్టే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించింది. అలాగే.. 'లోరియల్ పారిస్‌తో పార్ట్‌నర్‌షిప్ సంతోషంగా ఉంది. మహిళా సాధికారత కోసం బలంగా నిలబడే బ్రాండ్ ఇది. ఎల్లప్పుడూ ఉత్తమ వ్యక్తులుగా ఉండాలని ప్రోత్సహిస్తుంది. ఇందులో విలువైన నా సొంత అనుభవాలను పంచుకున్నా' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. సెలబ్రిటీలు నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ బ్యూటీ స్త్రీ ద్వేషం, పితృస్వామ్యం, లింగ సమానత్వంపై నిర్భయంగా తన గొంతు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.