తమిళనాడు పెళ్లి జంటకు వైరటీ గిఫ్ట్స్! నెట్టింట్లో నోరెళ్లబెట్టారు!!
నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. Tamil Nadu newly married couple get variety wedding gift.
దిశ, వెబ్‌డెస్క్ః దేశంలో గత కొన్ని వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెంచింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.110 దాటాయి. ఇలా పెట్రోల్, డీజిల్ పెరుగుతున్న నేపథ్యంలో కొందరు ఈ పరిస్థితిని సైటైర్‌గా వాడుతున్నారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా చెయ్యూర్‌లో వివాహ కార్యక్రమానికి హాజరైన స్నేహితులు వరుడు గ్రేష్ కుమార్, వధువు కీర్తAmid fuel price hike, Tamil Nadu couple gets petrol and diesel as wedding presentనలక సర్ ప్రైజ్ గిఫ్ట్‌గా పెట్రోల్, డీజిల్‌ను ప్రజెంట్ చేశారు. పైనున్న ఫోటోలో కనిపిస్తున్నట్లు వధూవరులు వేదికపై నిలబడి ఉండగా, వారికి ఒక లీటర్ పెట్రోల్, ఒక లీటర్ డీజిల్ బహుమతిగా ఇచ్చారు. ఈ ప్రత్యేక బహుమతిని జంట నవ్వుతూ స్వీకరించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.