మతిమరుపు వ్యాధి మహిళల్లోనే ఎక్కువ.. ఎందుకు?
దిశ, ఫీచర్స్ : కొన్నేళ్లుగా అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధి మహిళలనే ఎందుకు ఎక్కువగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
దిశ, ఫీచర్స్ : కొన్నేళ్లుగా అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధి మహిళలనే ఎందుకు ఎక్కువగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వారికి ఒక క్లూ దొరికింది. 'O6-Methylguanine-DNA-methyltransferase(MGMT)'గా పిలువబడే జన్యువు స్త్రీ పురుషుల్లో దెబ్బతిన్న డీఎన్‌ఏను రిపేర్ చేయడంలో ముఖ్యమైంది. అయితే పురుషుల్లో MGMT, అల్జీమర్స్ మధ్య సహసంబంధాన్ని శాస్త్రవేత్తలు కనుగొనలేదు. కానీ మహిళల్లో మాత్రం ఈ బంధాన్ని గుర్తించారు.
రెండు విధానాల్లో అల్జీమర్స్ వ్యాధిపై అధ్యయనం
యూనివర్సిటీ ఆఫ్ చికాగో, బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్(BUSM) పరిశోధకులు రెండు స్వతంత్ర డేటా సెట్స్ ఉపయోగించడం ద్వారా MGMT, మహిళల్లో అల్జీమర్స్ వచ్చే అవకాశాల మధ్య సంబంధాన్ని గుర్తించారు. మొదటి విధానాన్ని హట్టెరైట్స్(యూరప్‌లోని తొలి మానవ జనాభాకు చెందిన ఒక పెద్ద కుటుంబం)లో పరిశీలించారు. చిన్న జీన్ పూల్, ఐసోలేటెడ్ కల్చర్ కారణంగా వారు ఈ అధ్యయనాల కోసం ఉపయోగించబడ్డారు. అయితే ఇందులో పాల్గొన్నవారంతా అల్జీమర్స్‌తో బాధపడుతున్న మహిళలే.
ఇక రెండో విధానంలో APOE ε4 లేనటువంటి(అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిసిన జన్యు రకం) 10,340 మంది మహిళల సమూహం నుంచి జన్యు డేటాను విశ్లేషించారు. ఈ మేరకు అల్జీమర్స్ వ్యాధి గల యూరోపియన్ వంశానికి చెందిన 60% మంది వ్యక్తులు ఈ జన్యు రకాన్ని కలిగి ఉన్నట్లు వారు కనుగొన్నారు. అంటే మహిళల్లో ప్రత్యేకమైన అల్జీమర్స్ వ్యాధి సంభవించేందుకు గల బలమైన అనుబంధాల్లో ఈ జన్యు కారకం ఒకటని అధ్యయన సీనియర్ రచయిత, BUSM బయోమెడికల్ జెనెటిక్స్ చీఫ్ లిండ్సే ఫారర్ అన్నారు.