ప్రజలకు అందుబాటులో అన్ని రకాల మద్యం బ్రాండ్‌లు: గజ్జెల నగేష్

Update: 2022-03-04 10:30 GMT

దిశ, శంషాబాద్: తెలంగాణలో ప్రజలకు అందుబాటులో అన్ని రకాల తెలంగాణలో ప్రజలకు అందుబాటులో అన్ని రకాల మద్యం బ్రాండ్ లు ఉన్నాయని తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ అన్నారు. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రషీద్ గూడలోని ఎక్సైజ్ డిపోను సందర్శించి అందులో ఉన్న మద్యం నిల్వలు పరిశీలించారు. అనంతరం రషీద్ కూడా సర్పంచ్ రాణి రవి తో కలిసి ఎక్సైజ్ డిపో లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారస్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. 2017వ సంవత్సరంలో దాదాపు 70 వేల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో ఇంత పెద్ద మద్యం డిపోను ఏర్పాటు చేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు.. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల మనసు గెలుచుకున్నారు అని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితులు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఘనంగా జరుపుకున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిపో మేనేజర్ తిరుపతి, రెడ్డి స్టోర్ ఆఫీసర్ మురళి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఫాతిమా,రషీద్ గుడ సర్పంచ్ రాణి రవి, ఉప సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి, నాయకులు మంచెర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News