పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇలా చెక్ పెట్టొచ్చు

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పురుషుల్లో వచ్చే అనేక రకాలైన క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి.

Update: 2022-07-21 15:01 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పురుషుల్లో వచ్చే అనేక రకాలైన క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి. ఇది ప్రొస్టేట్ గ్రంథిలో మొదలవడంతో.. సాధారణ పనితీరులో విస్తరణ, నొప్పి మరియు అంతరాయం కలిగిస్తుంది. అయితే వారసత్వం, ఊబకాయం, వయస్సు వంటి కారకాలు ఈ క్యాన్సర్‌ ప్రమాదాన్ని ప్రభావితం చేసినప్పటికీ.. తీసుకునే ఫుడ్ కూడా ఈ క్యాన్సర్‌కి ఒక కారణమని కొత్త అధ్యయనం పేర్కొంది.

యూరోపియన్ యూరాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేసిన మాంసంతో కూడిన అనారోగ్యకరమైన ఫుడ్, ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంది. ఇందుకోసం12వేల మంది లైఫ్‌స్టైల్ డేటాను సేకరించిన నిపుణులు.. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం ద్వారా మరణాన్ని 45శాతం తగ్గించవచ్చని గమనించారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, ఆల్కాహాల్ మానేస్తే మంచిదని సూచిస్తున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వాలి :

* మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది

* కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటే జాగ్రత్తలు పాటించాలి

* పొత్తి కడుపులో నొప్పి, కీళ్ల వాపు, ఎముకల్లో నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి

* క్యాన్సర్ ముదిరితే అంగస్తంభన సమస్యలు ఏర్పడే చాన్స్

* యూరిన్ లేదా వీర్యం నుంచి బ్లడ్ వస్తే అప్రమత్తం అవ్వాలి

ఆహారం.. క్యాన్సర్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది :

క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేయడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకించి వారసత్వంగా వచ్చినపుడు.. పోషకాహారం, స్థిరమైన ఆరోగ్య అలవాట్లు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. చక్కెర కలిగిన ఫుడ్స్, ఆవుపాలు అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆవు పాలలో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచేందుకు సాయపడుతుంది. బేకన్, సలామీ, సాసేజ్‌తో ప్రాసెస్ చేసిన మాంసాలను ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్‌గా పిలుస్తారు. ఇవి హార్మోన్ స్థాయిల్లో విపరీత మార్పుకు కారణమవుతాయి. ఇక ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు చేపలు, టమోటాలు, బెర్రీస్ సిఫారసు చేస్తున్నారు నిపుణులు. 

Tags:    

Similar News