Akshay Kumar: నీటిలో పడిపోయిన హీరో ఫ్రెండ్ సీరియస్ .. భార్యకు కూడా..

దిశ, సినిమా: బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ప్రకృతి, తోటి జీవజాతుల పై ప్రేమ కలిగి ఉండాలని చెబుతుంటాడు.

Update: 2022-04-11 07:43 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ప్రకృతి, తోటి జీవజాతుల పై ప్రేమ కలిగి ఉండాలని చెబుతుంటాడు. ఈ విషయంలో ఎన్నోసార్లు చేతల్లోనూ నిరూపించి ఆదర్శంగా నిలిచిన రియల్ హీరో.. తాజాగా ఓ తూనీగ ప్రాణం కాపాడి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవల అక్షయ్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా ఓ తూనీగ అందులో పడింది. ఇది గమనించిన ఆయన వెంటనే దాన్ని బయటికి తీసి, ఊపిరి అందించి స్వయంగా గాల్లోకి ఎగరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటుడు.. 'ఈ లిటిల్ ఫ్రెండ్ ఉదయం స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు.

అతనికి సహాయం అవసరమైంది. కొంచెం ఓపిక వచ్చిన తర్వాత ఎగిరిపోయాడు. మనందరికీ కావాల్సింది అదే కదా. హృదయంలో ఆశ, జీవించాలనే సంకల్పం, ఎగరడానికి రెక్కలు'అంటూ ఇన్‌స్పిరేషనల్‌ నోట్ షేర్ చేశాడు. అయితే ఈ వీడియో పై తన భార్య ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ.. 'మీరు ఎల్లప్పుడూ నాకు ఇలాంటి స్వేచ్ఛనే అందిస్తారు అని రిప్లై ఇవ్వడం విశేషం.

Tags:    

Similar News