అఖిలేశ్ ఆరోపణలు అర్థరహితం: యూపీ మంత్రి మోహసిన్ రాజా

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడిందని ..telugu latest news

Update: 2022-03-09 16:33 GMT

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడిందని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఆ రాష్ట్ర మంత్రి మోహసిన్ రాజా అన్నారు. మార్చి 7వ తేదిన యూపీలో చివరిదశ పోలింగ్ ముగిసాక ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే, యూపీలో మరోసారి యోగి ప్రభుత్వ రాబోతున్నదని అన్ని సర్వేలు తేల్చడంతో అఖిలేశ్ యాదవ్ ఈవీఎం టాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి రాజా గురువారం స్పందించారు. ' బీజేపీ ప్రభుత్వం ఈవీఎం టాంపరింగ్ చేసిందని అఖిలేశ్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని.. ఎలక్షన్ కమిషన్ పనితీరునే ఆయన తప్పుబడుతున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎస్పీ పార్టీ తమ ఓటమిని అంగీకరించినదని ఆయన అభివర్ణించారు.ఇదిలా ఉండగా వారణాసిలో ఈవీఎంలు కనిపించకుండా పోయాయని కూడా అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

Tags:    

Similar News