సమ్మెలు, పోరాటాల ద్వారానే హక్కుల సాధన: తిరుపతి

దిశ, తాండూర్: సార్వత్రిక సమ్మెలు, పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధన..AITUC Leader hits out at central govt

Update: 2022-03-16 07:35 GMT

దిశ, తాండూర్: సార్వత్రిక సమ్మెలు, పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధన, సమస్యలు పరిష్కరించబడతాయని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షులు బయ్య మొగిలి అన్నారు. గోలేటిలో బుధవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలతోపాటు, సింగరేణి, ఎల్ఐసీ, రైల్వే సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదన్నారు. 44 కార్మిక చట్టాలను మారుస్తూ నాలుగు కోడ్ లుగా విభజిస్తూ కార్మికుల హక్కులు లేకుండా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాక్ లను టెండర్ల ద్వారా ప్రైవేట్ వారికి దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రయత్నిస్తోందన్నారు. సింగరేణిలో రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ జోక్యం తగ్గించడానికి, సింగరేణిని కాపాడుకోవడం కోసం, కార్మిక హక్కుల సాధన కోసం ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాస్, రాజేష్, దివాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Tags:    

Similar News