ఆ హీరోయిన్ పెద్ద తిండిబోతు.. ఎక్కడికెళ్లిన అదే పనిగా
దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ రొమాంటిక్ జంటగా పేరుపొందిన పెయిర్స్‌లో ఆదిత్య రాయ్ కపూర్-శ్రద్ధా కపూర్ జోడీ ఒకటి.
దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ రొమాంటిక్ జంటగా పేరుపొందిన పెయిర్స్‌లో ఆదిత్య రాయ్ కపూర్-శ్రద్ధా కపూర్ జోడీ ఒకటి. 2013లో మ్యూజికల్ డ్రామా 'ఆషికి 2'తో ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారిపోయిన ఇద్దరూ.. అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతూ, టైమ్ వస్తే ఒకరిపై ఒకరు ఫన్నీ కామెంట్స్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిత్య.. 'మీకు పరిచయమున్న వాళ్లలో అతిపెద్ద ఆహార ప్రియులు ఎవరు?' అనే ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా శ్రద్ధ పేరు చెప్పేశాడు. ఎక్కడికెళ్లినా కొత్త కొత్త వెరైటీల కోసం ఆరాటపడుతుందని సరదాగా చెప్పుకొచ్చాడు.