అభివృద్ధికి చిరునామా కేసీఆర్: ఎమ్మెల్యే చిరుమర్తి

దిశ, రామన్నపేట: అభివృద్ధికి చిరునామా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని నకిరేకల్ latest telugu news..

Update: 2022-03-05 10:47 GMT

దిశ, రామన్నపేట: అభివృద్ధికి చిరునామా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం మండలంలోని సర్నేనిగూడెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతివనం, వైకుంఠదామం, డంపింగ్ యార్డ్‌లను ఆయన ప్రారంభించారు. రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అలాగే 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎంపీటీసీ తిమ్మాపూర్ మహేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భారతరత్న బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్నేనిగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేసేది కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గ్రామ ప్రముఖులు అడిగిన వారంలోపే 25 లక్షల రూపాయలను సీసీ రోడ్లకు మంజూరు చేసానని తెలిపారు. పనిచేసే వారికి పట్టం కట్టాలని ఆయన కోరారు.

సంక్షేమం ఇలానే కొనసాగాలంటే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నబోయిన జ్యోతి బలరాం, సర్పంచ్ ధర్నే రాణి, ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, తహశీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ బోయ గాలయ్య, పంచాయతీ కార్యదర్శి సుధ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ రెడ్డి, పోష బోయిన మల్లేశం, నాయకులు గుత్తా నర్సిరెడ్డి, అంతటి రమేష్, ఖమ్మంపాటి శ్రీనివాస్, కాటేపల్లి యాదయ్య, మెట్టు మహేందర్ రెడ్డి, మందడి శ్రీధర్ రెడ్డి, బందెల రాములు, నర్రా నరసింహ, రూపని మల్లయ్య, మల్లెబోయిన శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News