జగన్‌పై నేతల అసమ్మతి.. మూకుమ్మడి రాజీనామాకు రంగం సిద్ధం

Update: 2022-04-10 10:33 GMT

దిశ, ఏపీ బ్యూరో: కొత్త మంత్రివర్గ ఏర్పాటు నేపథ్యంలో వైసీపీలో అసమ్మతి బయటకు వస్తుంది. తాజాగా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అనుచరులు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ ర్యాలీ నిర్వహించారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పిన్నెల్లి. రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి జగన్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారాని నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నూతన జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని వారు జగన్‌ను కోరుతున్నారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మాచర్ల చరిత్రను తిరగరాసిన పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోవటం ఏమిటని కార్యకర్తలు పార్టీ రాష్ట్ర అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి సేవ చేసే వారికి పదవులు దక్కవా అంటూ పార్టీ కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి అర్హుల లిస్ట్ అంటూ ప్రచారం జరుగుతున్న ఏ జాబితాలోనూ పిన్నెల్లి పేరు లేకపోవడంపై వారు అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి దక్కకుంటే తాము పదవులకు రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News