ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ఏసీ బంద్

ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ఈ నెల 29 నుంచి ఏసీ బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్

Update: 2022-03-26 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో :  ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ఈ నెల 29 నుంచి ఏసీ బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ స్పష్టం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో ఏసీని నడపడం సాధ్యం కావడం లేదన్నారు. ఓలా, ఉబర్ కంపెనీలు సైతం కమీషన్ రేట్లు పెంచడం లేదని అందుకే ఓసీని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కిలో మీటర్లకు రూ.12 నుంచి రూ.13 మాత్రమే ఇస్తున్నారని, ఏసీ ఆన్ చేస్తే రూ.24 నుంచి రూ.25 ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఏసీ ఆన్ చేస్తే డ్రైవర్లు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కనీస ధరలను నిర్ణయించి అమలు చేసేలా చర్యలు తీసుకొని డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Tags:    

Similar News