స్టార్‌డమ్ కోసం త్యాగాలు చేయను.. అభయ్ డియోల్

దిశ, సినిమా : ప్రముఖ నటుడు అభయ్ డియోల్ సినీ పరిశ్రమలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపాడు.

Update: 2022-08-02 11:32 GMT
స్టార్‌డమ్ కోసం త్యాగాలు చేయను.. అభయ్ డియోల్
  • whatsapp icon

దిశ, సినిమా : ప్రముఖ నటుడు అభయ్ డియోల్ సినీ పరిశ్రమలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అయితే తనను ఆదరించిన ప్రేక్షకుల కోరికలు తీర్చడానికి ఎన్నోసార్లు తీవ్రమైన ఒత్తిడిని కూడా ఫేస్ చేసినట్లు అంగీకరించాడు. ఈ క్రమంలోనే తానెప్పుడూ స్టార్‌డమ్ కోసం ఎలాంటి త్యాగాలు, భిన్నమైన వేషాధారణలు చేయలేదన్న అభయ్.. ఒకే ఫీల్డ్‌లో ఎక్కవకాలం ఉండటం తాను కష్టంగా భావిస్తానన్నాడు. కానీ, అవకాశం లభిస్తే నటుడిగా ఇంకా ఎంతో చేయగలననే విషయం తనకు తెలుసని, ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలు రావడమే కష్టంగా మారిందని చెప్పుకొచ్చాడు. 'ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సులభంగా అనిపించినా.. అడుగుపెట్టాక కష్టంగా మారుతుంది. రోజురోజుకు విస్తరిస్తున్న సినీ పరిశ్రమలో పెరుగుతున్న పెట్టుబడులతో పాటు ఒత్తిడి కూడా మరింత ఎక్కువవుతోంది. వారసత్వంతో వచ్చినా సరే టాలెంట్ లేకపోతే ఇక్కడ రాణించలేరు' అంటూ కుండబద్దలు కొట్టాడు అభయ్.

Full View

Tags:    

Similar News