మందు బాబులకు శుభవార్త.. ఒక బీరు కొంటే మరోటి ఫ్రీ.. ఎక్కడంటే?
మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఒక బీరు (Beer) కొంటే మరొక బీరు ఇచ్చేందుకు... ముందుకు వచ్చారు మద్యం దుకాణదారులు

దిశ, వెబ్ డెస్క్: మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఒక బీరు (Beer) కొంటే మరొక బీరు ఇచ్చేందుకు... ముందుకు వచ్చారు మద్యం దుకాణదారులు ( Liquor shops Owners). ఈ ప్రకటనతో... వైన్స్ ( Wines) వద్ద క్యూ కడుతున్నారు మందుబాబులు. అయితే ఈ బంపర్ ఆఫర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. ఉత్తర ప్రదేశ్ లో ( Uttar Pradesh ) ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక బీర్ కొంటె మరొక బీరు ఫ్రీగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు ఉత్తరప్రదేశ్ లోని మద్యం దుకాణదారులు.
ఈ మేరకు అధికారిక ప్రకటన ప్రకటన కూడా చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ మాసం ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ ( New Liquor Policy ) అమలులోకి రాబోతుంది. అయితే.. ప్రస్తుతం అన్ని లిక్కర్ షాపుల్లో.. పాత మద్యం ఉంది. ఏప్రిల్ ఒకటో తేదీకి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దింతో ఉన్న స్టాక్ మొత్తాన్ని... క్లియర్ చేయాలని... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం దుకాణదారులు ( Liquor shops Owners) నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆఫర్ లో భాగంగా బ్రాండీ , అలాగే విస్కీలపై 50 నుంచి 70% డిస్కౌంట్ అందిస్తున్నారు. అదే సమయంలో... బీర్లపైన వన్ ప్లస్ వన్ ఆఫర్.. పెట్టారు. అంటే ఒక బీరు కొంటే మరొక బీరు ఉచితంగా అందిస్తున్నారు. ఇటు 3000 ఉన్న లిక్కర్ బాటిల్ ను వెయ్యి రూపాయలకు అందిస్తున్నారు దుకాణదారులు. అయితే ఈ ప్రకటన రాగానే మందుబాబులు ఒక్కసారిగా ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 40 శాతం లిక్కర్ కొనుగోలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.