అయ్యో పాపం.. యువ కార్మికుడి ఆత్మహత్యతో రోడ్డున పడ్డ కుటుంబం
దిశ, దుబ్బాక : ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత యువ కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య..latest telugu news
దిశ, దుబ్బాక : ఆర్థిక ఇబ్బందులు తాళలేక చేనేత యువ కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన కాల్వ శ్రీనివాస్ (37) అనే చేనేత కార్మికుడు ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. చేనేత వృత్తిలో చేతి నిండా పని లేక గత కొద్ది రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కంపౌండర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
తనకు వచ్చే కొద్ది జీతంతో భార్య, రెండు సంవత్సరాల కూతురు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి, పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి ని పోషించలేక బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పో-సప్పో చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి నెలకొందని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కుల పెద్దలు, బంధువులు కోరుతున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మన్నె స్వామి తెలిపారు.