నవ్వినా.. ఏడ్చినా.. చెమట పట్టినా.. మరణమే!

దిశ, ఫీచర్స్ : నాటింగ్‌హామ్‌కు చెందిన 27 ఏళ్ల నటాషా కోట్స్.. మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది.

Update: 2022-07-03 13:01 GMT

దిశ, ఫీచర్స్ : నాటింగ్‌హామ్‌కు చెందిన 27 ఏళ్ల నటాషా కోట్స్.. మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. ఆమె శరీర స్థితి చెమట పట్టడం, నవ్వడం లేదా బాధకు గురవడం వంటి మార్పులు అనుభవిస్తే.. ప్రాణాంతక ఎలర్జీకి దారితీసే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దీని వల్ల ఆమె తన జీవితంలో ఇప్పటికే 500 కంటే ఎక్కువ సార్లు ఆస్పత్రి పాలైంది.

నటాషా కోట్స్ బ్రిటిష్ డిజెబిలిటీ జిమ్నాస్టిక్స్‌లో సభ్యురాలు. రెండేళ్ల కిందట ఫ్రెండ్స్‌తో కలిసి బాగా నవ్వుతున్నపుడు ఆమె నాలుక, గొంతు ఉబ్బిపోయింది. ఆస్పత్రికి తరలించేలోపే స్పృహ కోల్పోయింది. బలమైన భావోద్వేగాల(Strong emotions) పట్ల తనకు అలర్జీ ఉన్నట్లు అప్పుడే తెలిసింది. నవ్వడం, ఏడవటం, విచారం లేదా ఒత్తిడి వంటి శారీరక మార్పులు తనలో రసాయన ప్రతిచర్యకు కారణం అవుతున్నాయి. దాదాపు ప్రతిరోజూ తనకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుండగా.. ఈ కారణంగా నటాషా ఇప్పటివరకు 500 కంటే ఎక్కువ సార్లు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

ఈ అరుదైన మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ కండిషన్ గురించి వివరించిన నటాషా.. 'నా శరీర కండరాలలోని మాస్ట్ సెల్స్ హైపర్ సెన్సిటివ్‌గా ఉన్నాయి. నాకు స్ట్రాంగ్ ఎమోషన్స్ కలిగినపుడు అవి హిస్టామిన్ అనే రసాయనాన్ని విడుదల చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఆహార అసమతుల్యత వంటి చిన్నపాటి సమస్యలకు కూడా ప్రతిచర్యగా చాలా రసాయనాలు రిలీజ్ అవుతాయి. అంతేకాదు ఒక్కోసారి ఎటువంటి కారణం లేకుండానే ఇలా జరగవచ్చు. కాబట్టి నేను అన్నింటికీ ఒకే సమయంలో అలర్జీని కలిగి ఉన్నాను' అని పేర్కొంది.

Tags:    

Similar News