తైవాన్‌లో టన్నుల కొద్ది బురద.. గుడిలో అది పేలడంతోనే..

దిశ, వెబ్‌డెస్క్: అగ్నిపర్వతం పేలడం అంటే సాధారణ విషయం కాదు. దాని తాకిడికి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లుతుంది. అయితే తాజాగా తైవాన్‌లోని ఓ గుడిలో అగ్నిపర్వతం

Update: 2022-04-09 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: అగ్నిపర్వతం పేలడం అంటే సాధారణ విషయం కాదు. దాని తాకిడికి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లుతుంది. అయితే తాజాగా తైవాన్‌లోని ఓ గుడిలో అగ్నిపర్వతం పేలింది. ఒక్కసారిగా అగ్నిపర్వతం పేలడంతో అక్కడి వారంతా ఆందోళన చెందారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ అగ్ని పర్వతం భగభగ మండే లావా ఉండేది కాదు. ఇదొక బురద అగ్ని పర్వతం. బురదేగా అనుకోవద్దు.. ఇందులో బురద సైతం తీవ్ర స్థాయిలో మండుతుంటుంది. అంతా చూస్తుండగానే భూ ఊపరితలంపైకి పొగలు కక్కుతూ బురద, నీరు వచ్చి పడుతున్నాయి. ఈ పేలుడు దాదాపు ఒక అంతస్తు భవనమంత ఎత్తుకు ఎగసింది. అయితే లావా రాకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ ఆ పేలుడు కారణంగా వచ్చే గ్యాస్ ఆరోగ్యానికి మంచి కాదని అధికారులు ప్రజలను ఆ ప్రాంతం నుంచి పంపించేశారు.

Tags:    

Similar News