నిండు గర్భిణిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. క్షేమంగా ఉన్న శిశువు

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. అతివేగంగా ఒకరు, నిర్లక్ష్యంగా మరొకరు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు..Latest Telugu News

Update: 2022-07-21 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. అతివేగంగా ఒకరు, నిర్లక్ష్యంగా మరొకరు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే, ఒక్కోసారి చిన్న ప్రమాదానికే అనేకమంది చనిపోతుండగా.. కొన్నిసార్లు అదృష్టం బాగుండి అతిపెద్ద ప్రమాదం సంభవించినా అందరూ సురక్షితంగా బయటపడుతుంటారు. తాజాగా.. ఇలాంటి ఘటనే యూపీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 8 నెలల గర్భిణి తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో అటువైపు వస్తోన్న భారీ ట్రక్కు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గర్భిణి చనిపోగా.. కడుపులో ఉన్న శిశువు, ఆమె భర్త క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.


Similar News