అక్కడ స్వీట్ ట్రేలలో ఈగలు, బొద్దింకలు దర్శనం..
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి లోని పరంపర - A series of sweet houses in Sangareddy district are selling junk food
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి లోని పరంపర స్వీట్ హౌస్ లో నాసిరకంగా తినుబండారాలను విక్రయిస్తున్నారు. స్వీట్ హౌస్ చూస్తే అద్దాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కానీ ఆ స్వీట్ హౌస్ లోని స్వీట్ల ట్రేలలో ఈగలు, బొద్దింకలు దర్శనమిస్తున్నాయి. ఆ స్వీట్ హౌస్ పైన పటారం.. లోన లొటారం అన్న విధంగా తలపిస్తున్నది. అంతే కాకుండా తినుబండారాల ప్యాకింగ్ పై దానికి సంబంధించిన రేట్ ఉంటుంది. కానీ తయారు చేసిన తేదీ, కాలం చెల్లుబాటు తేదీ లేకపోవడం గమనార్హం. అందులోనూ సంగారెడ్డిలోని ఏ స్వీట్ హౌస్ లలో లేని విధంగా ఎక్కువ రేట్లు ఉండటం దీని ప్రత్యేకత. రేట్లు ఎక్కువ ఉండడంతో పరంపరలో తినుబండారాలు నాణ్యతగా ఉంటాయని ప్రజలు భ్రమలో ఉండేవారు.
అందుకే ప్రజలు పరంపర స్వీట్ హౌస్ లో స్వీట్స్, కారా, కేక్స్ తదితర తినుబండారాలను ఇష్టంగా కొనుగోలు చేద్దామని వెళ్లేసరికి ఇలా ఈగలు, బొద్దింకలు స్వీట్ ట్రే లలో దర్శనం ఇచ్చాయి. దీంతో ప్రజలు విసుగు పడి వెనుతిరిగి వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆహార భద్రత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి.. నాణ్యత లేని స్వీట్ హౌస్ లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.