ఒకరిపై ఒకరు 60 కేసులు పెట్టుకున్న జంట.. సుప్రీం కోర్టు తీర్పుకు అంతా షాక్..

దిశ, వెబ్‌డెస్క్: భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధాలు, వాగ్వాదాలు సర్వసాధారణం. ఒకరి తీరు మరొకరికి నచ్చకుంటే వారికి భారత రాజ్యాంగం విడాకుల సౌలభ్యం

Update: 2022-04-07 16:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధాలు, వాగ్వాదాలు సర్వసాధారణం. ఒకరి తీరు మరొకరికి నచ్చకుంటే వారికి భారత రాజ్యాంగం విడాకుల సౌలభ్యం కూడా కుదిర్చింది. ఒక్కసారి విడాకులు తీసుకుంటే ఇక ఎవరి జీవితం వారిది. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరు పట్టించుకోను కూడా పట్టించుకోరు. కానీ జంట మాత్రం విడిపోయిన తర్వాత కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూనే ఉన్నారు. వారి 30 ఏళ్ల వైవాహిక, 11 విడిపోయిన జీవితంలో వారిద్దరి ఒకరిపై ఒకరు దాదాపు 60 కేసులు నమోదు చేసుకున్నారు. అయితే వారి కేసులను విచారిస్తున్న సుప్రీం కోర్టు వారికి అదిరిపోయే తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. కొందరు గొడవ పడటాన్ని ఇష్టపడతారు. అందులోనూ వారు కోర్టులో గొడవపడేందుకు మరింత ఆసక్తి చూపుతారు. వారికి కోర్టును చూడకపోతే ఆ రోజు నిద్ర కూడా పట్టదు' అన్నారు. అంతేకాకుండా ఆ జంటకు వారి గొడవలను నివారించుకునేందుకు ధ్యానం చేయమని సూచించారు. అయితే ఎల్‌వీ రమణతో పాటు ఉన్న జస్టిస్ క్రిష్ణ మురారి, హిమా కోహ్లీ విడిపోయిన జంట ఒకరిపై ఒకరు 60 కేసులు నమోదు చేశారని తెలియడంతో విస్తుపోయారు. అనంతరం వారు కూడా జంటకు ధ్యానం చేయాలని తెలిపారు.

Tags:    

Similar News