అవ్వపై ప్రేమను చాటుకున్న కోతి.. ఇంటికొచ్చి ఏం చేసిందంటే.. వీడియో వైరల్
దిశ, వెబ్డెస్క్: ఏదైనా ఆటవిక జంతువు ఇంటిలోకి వచ్చిందంటే ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తాం. అటువంటిది
దిశ, వెబ్డెస్క్: ఏదైనా ఆటవిక జంతువు ఇంటిలోకి వచ్చిందంటే ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తాం. అటువంటిది ఓ పెద్ద కోతి ఇంటిలోకి రావడమే కాక, ముసలావిడ పైకి ఎక్కి కూర్చుంది. కానీ పక్కనే ఉన్న కోడలు మాత్రం కోతికి దండం పెడుతూ చూస్తూ ఉండి పోయింది. అవ్వ మాత్రం కోతి చూసి నవ్వుతూ చాలా సంతోషంగా కనిపిస్తోంది. అయితే ముసలి అవ్వపై కూర్చున్న కోతి మాత్రం ఆమెను కౌగిలించుకుని, కాసేపు పక్కనే కూర్చుని వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ అవ్వ ఆ కోతికి ప్రతి రోజు రెండు రొట్టెలు ఇచ్చేదట. కానీ కొన్ని రోజులు రొట్టెలు లేవు, అవ్వ కనిపించకపోవడంతో కోతి కంగారు పడిపోయింది.
అంతే అసలు అవ్వకు ఏమైందో తెలుసుకునేందుకు ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన కోతికి అవ్వ అనారోగ్యంతో మంచంలో పడుకొని కనిపించింది. అంతే వెంటనే మంచంపైకి ఎక్కి అవ్వను కౌగిలించుకుంది కోతి. అలా కాసేపు ఉన్న తర్వాత అవ్వ పక్కన కూర్చుని మరికొద్ది సేపు చూసింది. అంతే అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు జంతువుల ప్రేమ అలానే ఉంటుంది. ప్రాణాలు పోయినా ప్రేమ తరగదు. అనారోగ్యం అంటే అయినవారే చూడటానికి రాని ఈ రోజుల్లో కూడా జంతువులు తమ అనుకున్న వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ముందుకొస్తున్నాయి అని అంటున్నారు. అంతేకాకుండా మరికొందరు జంతు ప్రేమకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
रोज सुबह एक वृद्घा बंदरों को रोटी देती थी. बीमार होने की वजह से दो दिन रोटी नहीं दे पाई तो बंदर उनका हाल जानने के लिए उसके पास आए.
— Awanish Sharan (@AwanishSharan) April 2, 2022
दिल को छूने वाले क्षण.❤️ pic.twitter.com/K4TdCSKL3w