జగద్గిరిగుట్ట పరిధిలో అగ్నిప్రమాదం.. ఎలక్ట్రానిక్ షాపులో ఎగిసిపడ్డ మంటలు

దిశ, కుత్బుల్లాపూర్ : ఎలక్ట్రానిక్ షాపులో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన జగద్గిరిగుట్ట..latest telugu news

Update: 2022-03-18 17:21 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : ఎలక్ట్రానిక్ షాపులో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వర నగర్‌లోని అన్నపూర్ణ ఎలక్ట్రానిక్ షాపులో శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గమనించిన నిర్వాహకులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. రాత్రి వరకు మంటలు రావడంతో చుట్టు పక్కల వారు బయన్దోళనకు గురయ్యారు. రోడ్డు పక్కనే కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News