హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. యువకుడు మృతి
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం.. Latest Telugu News..
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. యువకులు డ్రగ్స్ సేవించేందుకు కొత్త ఎత్తుగడులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటూ మరిణించిన తొలి కేసును పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇందులో నిందితుడు ప్రేమ్‌తో పాటు మృతిచెందిన యువకుడు కూడా డ్రగ్స్ తీసుకుని అమ్మేవాడని పోలీసులు గుర్తించారు. మొత్తం పోలీసుల అదుపులో డ్రగ్స్‌కు అలవాటు పడ్డ 23 మంది యువకులు ఉన్నారు. చనిపోయిన యువకుడు తరచూ గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్న బీటెక్ విద్యార్థి అని పోలీసులు వెల్లడించారు. విద్యార్థి డ్రగ్స్‌కు అలవాటు పడి పేషెంట్‌గా మారాడని.. వారం రోజుల్లో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడని తెలిపారు.