హీరో కావాలని రూ.300లతో ఇంట్లో నుంచి పారిపోయిన కుర్రాడు.. కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో

కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెర హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత కాలంలో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-18 09:33 GMT

దిశ, సినిమా: కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెర హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత కాలంలో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్ సినిమాలతో సౌత్ ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్‌లేని ఫ్యామిలీ నుంచి వచ్చి నేడు టాప్ హీరోగా రాణించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం యష్ కేజీఎఫ్3లో నటిస్తున్నాడు. అయితే ఇతనికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

యష్ హీరో కావాలని రూ.300 లతో ఇంట్లో నుంచి వెళ్లి పోయాడట. అలా బయటకు వచ్చి అవకాశాల కోసం తిరగని స్టూడియో అంటూ లేదట. దీంతో ఇతనికి 2007లో ‘జంబద హుడిగి’ అనే చిత్రంలో నటించే చాన్స్ వచ్చిందట. ఇక 2016లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ చిత్రం అతడి కెరీర్‌ను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు యష్‌‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఈయన పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారిపోయాడు అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

(video link credits to yash team instagram id) 


Similar News