ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ల అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి..latest telugu news

Update: 2022-03-26 13:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి 36 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి తిరిగి ఆటోలో వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే పెట్రోల్‌ ట్యాంక్‌ ఖాళీగా ఉందని చెప్పడంతో ఆటో డ్రైవర్‌ మధ్యలోనే ఆపాడు. ఆటో డ్రైవర్ తన సహచరుడిని అక్కడికి పిలిపించాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ప్రస్తుతం మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 323 (రేప్), 365 (కిడ్నాప్), 376డి (గ్యాంగ్ రేప్) కింద గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News