ఆకస్మిక తనిఖీల్లో రైలు టికెట్ లేకుండా పట్టు బడిన 877 మంది..7 లక్షల జరిమానా

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ latest telugu news..

Update: 2022-03-24 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఆకస్మిక తనిఖీల నిర్వహించారు. గురువారం దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (పీఎస్‌)ఆర్‌ సుదర్శన్‌ పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టారు. టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని, అక్రమంగా ప్రయాణిస్తున్న, బుక్‌ చేయకుండా లాగేజీ తీసుకుళ్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో వివిధ కారణాలతో 887 మంది పట్టుబడ్డారని, ఇందులో టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న 877 మంది పట్టుబడ్డారని, బుకింగ్‌ చేయకుండా లగేజీని తరలిస్తున్న ప్రయాణికులపై 7 కేసులు బుక్‌ చేశారని అధికారులు వెల్లడించారు.

వీరి నుంచి మొత్తం రూ.7,02,865 జరిమానా వసూలు చేశారని తెలిపారు. రైల్వే పరిసరాల్లో పొగ తాగుతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారికి రూ 300 జరిమానా విధించినట్లు తెలిపారు. 61 మంది టికెట్‌ తనిఖీ సిబ్బంది, 9 మంది రైల్వే రక్షణ దళ సిబ్బంది, అధికారులు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో పాల్గొన్నట్లు తెలిపారు. మొత్తం 23 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారని అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News