నెట్టింట మరో 'మట్టిలో మాణిక్యం', సంచలనం కానుందా..?!
ప్రతి పరిణామం వెనుక గొప్ప అవకాశాలు ఉంటాయి. 8 Year old girl from Chattishghar, Dantewada goes viral on Social media.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రతి పరిణామం వెనుక గొప్ప అవకాశాలు ఉంటాయి. అలాగే, సోషల్ మీడియా ఏంతో మందికి ఒక వరంలా దొరికింది. సోషల్ మీడియా వేదికపై కనబడి, సెలబ్రిటీలుగా ఎదిగినవారు అనేకమంది. ఇలా బయటకి వచ్చివాళ్లలో కొందరు 'మట్టిలో మాణిక్యాలు' కూడా ఉన్నారు. అణగారిన వర్గం నుండి వచ్చిన వీళ్లు సెలబ్రిటీల స్థాయికి చేరకపోయినా మంచి గుర్తింపును అందుకొని, మెరుపులా మెరుస్తారు. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారు. అలాంటి, ఒక చిన్నారి ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఈ 8 ఏళ్ల గిరిజన బాలిక "మూరి మురమి" గొంతు కోకిల గానంలా ఎంతో మధురంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పాప పాడిన 'కహీ ప్యార్ న హో జాయే..' పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ముందు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 10 ఏళ్ల బాలుడు సహదేవ్ దిర్డోలా ఇప్పుడు మూరి కూడా ఇంటర్నెట్ సెలబ్రిటీ అయ్యింది. నెటిజన్లు ఈ చిన్నారిని లెజెండరీ సింగర్ దివంగత లతా మంగేష్కర్‌తో పోల్చుతున్నారు. ఈ క్లిప్‌కి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది.