Viral Video: వృద్ధ దంపతుల త‌గాదాను ఇలా తీర్చిన‌ పోలీసులు.. వీడియో వైర‌ల్‌!

మ‌ళ్లీ పోలీస్ స్టేష‌న్‌కు రావ‌డం విచిత్రంగానే కాదు... 75-YO UP Couple Had A Fight And Cops Solve Their Dispute.

Update: 2022-04-14 08:29 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ర్వ‌సాధార‌ణం. అయితే, ఒక‌ యువ జంట గొడ‌వ‌ప‌డితే అందులో చాలా సీరియ‌స్ అంశాలు ఉండొచ్చేమో..! కానీ 75 ఏళ్ల జీవితానుభ‌వంతో ఎన్నో ఒడిదుడుకులు త‌ట్టుకోని, దాదాపు 55 ఏళ్ల సంసారంలో చాలా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకున్న జంట, మ‌ళ్లీ పోలీస్ స్టేష‌న్‌కు రావ‌డం విచిత్రంగానే కాదు, వారిలో అమాయ‌క‌త్వాన్ని స్ప‌ష్టంగా చూపిస్తుంది. 'పెరిగి పెరిగి పెద్ద‌లే పిల్ల‌లౌదురు' అన్న‌ట్లు వృద్ధుల గొడ‌వ‌లు కూడా పిల్ల‌ల్లాగే ఉంటాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం అవ‌స‌రంలేదు. ఇలాగే, ఉత్తరప్రదేశ్‌లో ఓ వృద్ధ దంపతుల మధ్య గొడ‌వ జరిగింది. ఇద్ద‌రూ త‌గాదా తీర్చ‌మ‌ని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు. ఇక్క‌డే, ఈ అమాయ‌క బీద వృద్ధుల జంట మ‌ధ్య ఉన్న‌ ఆప్యాయ‌త, వారిలోని పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం క‌నిపించింది. వివ‌రాల్లోకి వెళితే..

గోండా పోలీసులు తెలిపిన స‌మాచారం మేర‌కు, శివనాథ్, జంకా దేవి అనే వృద్ధ దంపతుల మ‌ధ్య ఏదో గొడవ రావ‌డంతో వారు విడివిడిగా నివసిస్తున్నారు. గ్రామస్థుల ప్రోద్భ‌లంతో వాళ్ల స‌మ‌స్య‌ను పరిష్కరించాలని ఇద్ద‌ర్నీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. కత్రా బజార్‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్‌లో వీళ్లిద్ద‌రి పంచాయితీ స‌మ‌సిపోయింది. అయితే, ఇద్ద‌రి మ‌ధ్య సంధి చేసిన పోలీసులు సంతోషంగా వారికి స్వీట్లు తెప్పించారు. ఒక‌రికొక‌రు స్వీట్లు తినిపించుకోమ‌ని పోలీసులు చెప్పారు. ఆ స‌మ‌యంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. వృద్ధుడు తన భార్యకు స్వీట్ తినిపిస్తూ, తన భార్యతో సరదాగా "హుమ్రా హత్వా నా కాత్ జై (నా చేతిని కొర‌కొద్దు) అంటాడు. వృద్ధురాలు సిగ్గుప‌డుతూ ఉంటుంది. గోండా పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజ‌న్ల నుండి స‌ర‌దా కామెంట్లు చాలా వ‌స్తున్నాయి. ల‌క్ష‌ల్లో వ్యూవ్స్‌, వెల‌ల్లో రీట్వీట్‌లు పొందింది.

Tags:    

Similar News