60 ఏళ్ల బామ్మతో యువకుడి పెళ్లి.. బిడ్డను కనేందుకు రూ. కోటి ఖర్చు
దిశ, ఫీచర్స్ : ప్రేమ.. కులమతాలు, రంగు రూపునే కాదు వయోబేధాలను సైతం పట్టించుకోదని తెలిసిందే..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ప్రేమ.. కులమతాలు, రంగు రూపునే కాదు వయోబేధాలను సైతం పట్టించుకోదని తెలిసిందే. ఎంతో మంది ప్రేమికులు ఇలాంటి అవాంతరాలన్నీ అధిగమించి తమ దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ 24 ఏళ్ల యువకుడు 61 ఏళ్ల వృద్ధ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ప్రస్తుతం ఆమెతో బిడ్డను కనేందుకు రూ. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమై వార్తల్లో నిలిచాడు.
ఖురాన్ మెక్‌కెయిన్(24), చెరిల్ మెక్‌గ్రెగోర్(61) గతేడాది సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. అయితే ఆమె వయసు రీత్యా పిల్లల్ని కనే అవకాశం లేదు. దీంతో సరోగసి ద్వారా 2023లోగా బిడ్డను పొందేందుకు £120,000 (దాదాపు రూ. 1.12 కోట్లు) వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ జంట పేర్కొంది. ఖురాన్‌కు ఇది మొదటి సంతానం కాగా.. చెరిల్‌కు ఇప్పటికే ఏడుగురు పిల్లలతో పాటు 17 మంది గ్రాండ్ చిల్డ్రన్ ఉండటం విశేషం.
ఇక త్వరలో కాబోయే తండ్రి ఖురాన్ ఈ విషయం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు. తన లవ్ లైఫ్‌తో ఓ కుటుంబాన్ని కలిగివుండాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. కాగా ఈ కొత్త ప్రయాణంలో మరో బిడ్డను పొందనుండటం అద్భుతంగా ఉంటుందని చెరిల్ పేర్కొంది. అయితే తమ మధ్య వయోబేధం కారణంగా ఈ జంట తరచూ విమర్శలకు గురవుతున్నప్పటికీ వాళ్లు అవేవీ పట్టించుకోకుండా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.