కూతురిపై 51 ఏళ్ల తండ్రి అత్యాచారం.. కేసు పెట్టని తల్లి.. ఏం చేసిందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మైనర్ కూతురిపై 51 సంవత్సరాల తండ్రి అత్యాచారానికి
దిశ, వెబ్‌డెస్క్: భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మైనర్ కూతురిపై 51 సంవత్సరాల తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి బీహార్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. తల్లి తనతో పాటు చిన్న కుమార్తెను, కొడుకును తీసుకెళ్లి.. పెద్ద కుమార్తెను బెంగళూరులోని తన భర్త వద్ద ఉంచింది.
ఈ సయంలోనే తండ్రి 13 ఏళ్ల తన కూతురిపై జనవరి 8, 2015 నుంచి ఫిబ్రవరి 19, 2015 మధ్య చాలా సార్లు అత్యాచారం చేశాడు. అయితే, ఈ విషయం గురించి తెలిసిన తల్లి మాత్రం పోలీసులకు చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే, ఈ విషయాన్ని పక్కింటి వారు చైల్డ్ వెల్ఫేర్‌కు సమాచారం అందించారు. దీంతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేశారు. అతనికి కోర్టు పోస్కో చట్టం ప్రకారం 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది.