ప్రాణం తీసిన అతివేగం.. చెట్టును ఢీకొని యువకుడి మృతి

దిశ, అశ్వారావుపేట: అతివేగం ప్రమాదకరమని పెద్దలు, ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను.. Latest Telugu news..

Update: 2022-03-20 09:33 GMT

దిశ, అశ్వారావుపేట: అతివేగం ప్రమాదకరమని పెద్దలు, ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టి యువత ప్రాణాలను పోగొట్టుకొని తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివారం తెల్లవారుజామున పట్టణ శివారులో చెట్టును కారు ఢీకొనడంతో కడలి హేమంత్ రెడ్డి (24) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం రెండు గంటల సమయంలో యువకుడు కడల హేమంత్ రెడ్డి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారును డ్రైవ్ చేస్తూ అశ్వారావుపేట నుండి భద్రాచలం వైపుగా వెళ్తుండగా, రెండవ కిలోమీటర్ రాయి వద్దనున్న మర్రిచెట్టును బలంగా ఢీ కొట్టాడు. దీంతో నుదుటి కడుపు లో కారు విడిభాగాలు గుచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కారు స్పీడోమీటర్ ముల్లు 170 వేగం వద్ద నిలిచి ఉండటం ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో కారు ఇంజన్ లోపల సీట్ల భాగంలోకి చొచ్చుకు వచ్చింది. మృతుడి తండ్రి రామిరెడ్డి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కోయిదా సమీపంలోని కోటరిగూడెం కాగా, రాచన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అశ్వారావుపేట పోస్టాఫీస్ వీధిలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. మృతుడికి అక్క అన్నయ్య ఉన్నారు.

Tags:    

Similar News