చరిత్రను తిరగరాసిన మార్చి.. 122 ఏళ్ల భారత రికార్డ్ బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో గత 122 ఏళ్ల ఉన్న రికార్డును 2022 మార్చి నెల బ్రేక్ చేసింది. ఎన్నడూ లేనంత
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో గత 122 ఏళ్ల ఉన్న రికార్డును 2022 మార్చి నెల బ్రేక్ చేసింది. ఎన్నడూ లేనంత సమ్మర్ హీట్ ఈ నెలలోనే నమోదైంది. 2022 మార్చి భారత దేశ 122 ఏళ్ల చరిత్రలో అత్యంత ఉష్ణోగ్రత నమోదైన నెలగా అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు మార్చి నెలలో నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత 2010లో 33.09 సెల్సియస్. ఈ రికార్డును 2022 మార్చి 33.1 డిగ్రీల సెల్సియస్‌తో బ్రేక్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మార్చి నెలకు ఉన్న రికార్డును ఈ నెల బ్రేక్ చేసిందని భారత వాతావరణ శాఖ అధికారికంగా వెళ్లడించింది. అంతేకాకుండా 2020 మార్చి నెల ఇప్పటివరకు రెండో హాటెస్ట్ నెలగా ఉందని, ఇప్పుడు మొదటి స్థానానికి 2022 మార్చి రావడంతో 2020 మార్చి మూడవ స్థానానికి పడిపోయిందని అధికారులు తెలిపారు.