ఉక్రెయిన్ ప్రతిఘటనలో 14,400 మంది రష్యా సైనికులు మృతి..
కీవ్: రష్యా దాడులను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. గత నెల 24..latest telugu news
కీవ్: రష్యా దాడులను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. గత నెల 24 నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 14,400 మంది రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. అంతేకాకుండా, రష్యాకు చెందిన 466 యుద్ధ ట్యాంకులు, 1,470 సైనిక వాహనాలు, 285 ఫిరంగి, రాకెట్ లాంచింగ్ వ్యవస్థలు, 44 యాంటీ- ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్ సిస్టమ్స్, 95 యుద్ధ విమనాలు, 115 హెలికాప్టర్లు, 914 ఇతర వాహనాలు, 60 ఫ్యూయల్ ట్యాంకులు, 3 బోట్లు, 11 ప్రత్యేక పరికరాలను నాశనం చేశామని ట్విట్టర్‌లో వివరించింది.
ఉక్రెయిన్‌పై 1,403 వైమానిక దాడులు
రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు తమ దేశంపై 1,403 సార్లు వైమానిక దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, 459 క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది.