Basara IIIT ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన మంత్రి సబితా..

Minister Sabitha Indra Reddy Reacts Over Basara IIIT Food Poison Incident| నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కావడం వల్ల 1200మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Update: 2022-07-15 14:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: Minister Sabitha Indra Reddy Reacts Over Basara IIIT Food Poison Incident|  బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మెరుగైన సేవలను అందించేలా చర్యలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని ఆమె ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టర్, ఆసుపత్రి వైద్యులతో సమన్వయం చేసుకుంటూ నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని వెంకటరమణకు మంత్రి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిపై మంత్రి ఫోన్ లో ఆరా తీశారు. విచారణ చేసి వెంటనే రిపోర్టు ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ ను మంత్రి ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Basara IIIT లో టెన్షన్ టెన్షన్.. 300 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత..

Tags:    

Similar News