తెలుగు విశ్వ విద్యాలయం ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
దిశ ప్రతినిధి , హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 2020- 21 విద్యా సంవత్సరానికి బీఎఫ్ఏ తో పాటు ఇతర పీజీకోర్సులలో చేరుటకు డిసెంబర్ 29న నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేసింది. శిల్పం ,చిత్రలేఖనం , జ్యోతిష్యం, జర్నలిజం అంశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 11న, నృత్యం, తెలుగు అంశాలకు సంబంధించిన పరీక్షలలో అర్హత పొందిన వారికి ఈ నెల 12న… విశ్వ విద్యాలయం […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 2020- 21 విద్యా సంవత్సరానికి బీఎఫ్ఏ తో పాటు ఇతర పీజీకోర్సులలో చేరుటకు డిసెంబర్ 29న నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేసింది. శిల్పం ,చిత్రలేఖనం , జ్యోతిష్యం, జర్నలిజం అంశాలకు సంబంధించి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 11న, నృత్యం, తెలుగు అంశాలకు సంబంధించిన పరీక్షలలో అర్హత పొందిన వారికి ఈ నెల 12న… విశ్వ విద్యాలయం సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కన్వీనర్ డాక్టర్ కె.హనుమంతరావు తెలిపారు.
కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు విధిగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థుల ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.teluguuniversity.ac.in లేదా www pstu.org లలో చూడవచ్చని ఆయన వివరించారు.